9, జులై 2012, సోమవారం
లవ్ జిహాద్..?
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో వెలసిన ఈ పోస్టర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముస్లిం అబ్బాయిలు, హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటూ మతమార్పిడులు చేయిస్తున్నారని.. ఇది లవ్ జిహాద్ అని ఈ పోస్టర్ పేర్కొంటోంది. హిందూ యువకులు మేల్కొని, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పోరాడాలని కోరింది. యాంటీ లవ్ జిహాద్ స్క్వాడ్ పేరుతో ఈ పోస్టర్ వెలసింది. బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ లను ఈ ప్రకటనలో ఉదహరించారు. అవసరమైతే సంప్రదించండంటూ ఓ మొబైల్ నెంబర్, ఓ ఈ మెయిల్ ఐడీని ప్రచురించింది. అయితే, ఇది భగత్ సింగ్ క్రాంతి సేన పని అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి