17, జూన్ 2012, ఆదివారం
సూపర్ సైనా..!
Categories :
indonesia open . news . saina . sports
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మరో సంచలనం సృష్టించింది. ఇండోనేషియన్ ఓపెన్ టైటిల్ ను దక్కించుకుంది. కొన్ని రోజుల కిందే థాయ్ ఓపెన్ ను గెలిచిన సైనాకు ఇది వరసగా రెండో విజయం.. అంతేకాదు.. ఈ ఏడాదిలో ఇది మూడో ఇంటర్నేషనల్ టైటిల్. ఓలంపిక్స్ ముందు కీలక టైటిల్స్ సాధించిన సైనా.. పతకంపై దేశవ్యాప్తంగా ఆశలు రేకిస్తోంది.
ఇండినేషియా టైటిల్ ను సాధించడానికి సైనా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చైనా ప్లేయర్ జురి లీ తొలిసెట్ ను గెలుచుకుని.. సైనాకు షాక్ ఇచ్చింది. అయితే.. వెంటనే తేరుకున్న సైనా.. రెండు, మూడు సెట్లను గెలుచుకుని విజేతగా నిలిచింది. 13-21,22-20,21-19 తేడాతో సైనా ఫైనల్స్ లో గెలిచింది. ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ.. ఒలంపిక్ మెడల్ ను కూడా దక్కించుకోవాలని ఆశిద్దాం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి