10, జూన్ 2012, ఆదివారం
సచిన్ భయపడ్డాడా...?
సచిన్ టెండుల్కర్.. క్రికెట్ మైదానంలో అరవీర భయంకర బౌలర్లకు ఏమాత్రం భయపడని చిచ్చర పిడుగు. సచిన్ అంటేనే బౌలర్లకు హడల్. అలాంటి సచిన్.. ఇప్పుడు భయపడుతున్నాడు. ఇంతకీ సచిన్ ను భయపెడుతోందేమిటో తెలుసా... ఓ బిల్డింగ్. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సచిన్ .. ఢిల్లీలోఉండడానికి కేంద్రం కేటాయించిన బిల్డింగ్. ఎందుకో తెలుసా.. అదో భూత్ బంగ్లా అని సచిన్ అనుకుంటున్నాడు కాబట్టి..
ఢిల్లీలో భూత్ బంగ్లా ఏమిటని అనుకోకండి.. సచిన్ వ్యక్తిగత స్టేటస్ ను దృష్టి పెట్టుకున్న కేంద్రం అతిసువిశాలమైన భవంతిని నిబంధనలను తోసి మరీ కేటాయించింది. అదే... తుగ్లక్ రోడ్ లోని 5వ నెంబర్ ఇల్లు. ఇక ఆ ఇంటి ప్రత్యేకతలను ఒక్కసారి చూస్తే..
రాహూల్‌గాంధీ ఇంటి ముందే భారీ భవనం.
క్యాబినెట్ మినిస్టర్‌ను తలపించే జడ్ ప్లస్ సెక్యూరిటీ.
రక్షణ కోసం 50 మంది గార్డ్స్, 2 ఎస్కార్ట్ వెహికిల్స్
ఇంట్లోనే భారీ గార్డెన్.. దాదాపు 7వేల చదరపు అడుగుల విశాల ప్రాంగణం.
కానీ, భూత్ బంగ్లా అన్న భయం సచిన్ ను వెంటాడింది. అంతే... ఆ బిల్డింగ్ నాకొద్దు మొర్రో అన్నాడు.. కాకపోతే, కవర్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రకటన చేశాడు. కేవలం రాజ్యసభ సమావేశాల్లోనే ఢిల్లీకి వచ్చే తనకు.. అంత హైక్లాస్ బిల్డింగ్ అవసరం లేదన్నాడు. తనకిచ్చి ప్రజాధనాన్ని వృథా చేయడం కన్నా.. తనకన్నా అవసరం ఉన్న మరొకరికి ఈ బిల్డింగ్ ను కేటాయించమని కేంద్రానికి సూచించాడు. ఢిల్లీవచ్చినప్పుడు హోటల్ లో ఉంటానని చెప్పేశాడు.
భూత్ బంగ్లా ఎందుకయ్యింది..?
సచిన్‌కు ప్రభుత్వం కేటాయించిన ఈ భవనం వెనుక రెండు విషాద గాధలున్నాయి. ఈ ఇంట్లో ఇంతకు ముందు నివసించిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కొడుకు సురేందర్సింగ్, జిందాల్ తో కలిసి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇదే ఇంట్లో కొన్నిరోజులు ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ... 2007లో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇద్దరు ప్రముఖులు ప్రమాదాల్లో చనిపోవడంతో.. సచిన్ భయపడినట్లు తెలుస్తోంది. కొంతమంది ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న లిటిల్ మాస్టర్.. దాని గుమ్మం కూడా తొక్కకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఆ బిల్డింగ్ వద్దని తేల్చి చెప్పేశాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నిజమా ? హ్మం ఇదే కారణం అయితే వేరే బంగ్లా అడిగేవాడు కదా ? అంతే కాదు ఈ బంగ్లా వద్దు అని తనే చెప్పవలసిన అవసరం లేదు, ఏదో కారణం తో గవర్నమెంటే ఆ పని చేసేది. ఏది ఏమైనా చూద్దాం , ఇంకా ఏమేమి కారణాలు పైకి వస్తాయో.