13, మే 2012, ఆదివారం
మీరు నోమోఫోబియా బారిన పడ్డారా..?
మీకు తెలియకుండానే మీ చేతులు.. జేబుపైకి వెళ్లిపోతున్నాయా..? అదే పనిగా తడుముతున్నాయా..?
ఏదో పనిచేస్తుండగా సడన్‌గా మీకు టెన్షన్ వేస్తోందా..? మీ మొబైల్‌ను పదే పదే చెక్ చేసుకుంటున్నారా..?
మొబైల్ ఫోన్ పోయిందేమోనని తరచూ భయపడుతున్నారా..?
SMSలు.. మిస్డ్కాల్స్ ఉన్నాయేమోనని పదే పదే చూసుకుంటున్నారా..?
ఈ లక్షణాలన్నీ మీలో కనిపిస్తే.. మీరో ఫోబియాతో బాధపడుతున్నట్లే.
ఏం ఫోబియా అని టెన్షన్ పడకండి.. .పైగా.. ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు.. మొబైల్స్ వాడుతున్న దాదాపు 66 శాతం మందిది ఇదే ప్రాబ్లమ్.. దీనికి ఓ పేరు కూడా ఉంది.. అదే నోమోఫోబియా.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. నో మొబైల్ ఫోన్ ఫోబియా.. మొబైల్ మిస్ అయినట్లు ఫీల్ అవ్వడమే.. ఈ ఫోబియాకు కారణం..
ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయలేకపోవడం.. మిస్డ్ కాల్స్, SMSలు, ఈమెయిల్స్ కోసం ఫోన్‌ను ఎక్కువసార్లు చూసుకోవడం.. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందేమోనని తరచూ భయపడడం.. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మీలో కనిపిస్తే.. నోమోఫోబియా బారిన పడ్డారన్నమాటే.
బ్రిటన్‌లో సెక్యూర్ఎన్వీ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. గతంతో పోల్చితే.. ఇలా నోమోఫోబియాతో బాధపడుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది. 18 నుంచి 24 ఏళ్ల లోపు వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు 77 శాతం మంది ఇలా ఫోన్ ఫోబియాతో భయపడుతున్నారు. 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సున్నవారిలో 66 శాతం మందిలో ఈ సమస్యకు గురవుతున్నారు. అంతేకాదు.. ఈ సర్వేలో తేలిన మరో ఆసక్తికర విషయం.. సగటున ప్రతీ ఒక్కరూ.. రోజుకు 34సార్లు ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నారట. ఫోన్లు, SMSలు రాకపోయినా.. ఇలా చెక్ చేసుకోవడమే... నోమోఫోబియా అంటున్నారు పరిశోధకులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి