28, మార్చి 2012, బుధవారం
కూలడానికి సిద్ధంగా ఉన్న విమానాలు
Categories :
airlines . kingfisher . news . TOP
కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏది ఎప్పుడు కూలుతుందో తెలియదు.. ఎక్కడ పడుతుందో తెలియదు.. కానీ, ఒక్క విషయం మాత్రం గ్యారెంటీ.. కూలిపోవడం కంపల్సరీ.. అవును.. భారత విమాన సంస్థల పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. కింగ్‌ఫిషన్ సంక్షోభం దేశాన్ని కుదిపేస్తున్న సమయంలోనే.. మిగిలిన విమాన సంస్థలదీ అదే పరిస్థితన్న షాకింగ్ న్యూస్.. టెన్షన్ పెడుతోంది.
రాజభోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే కింగ్ ఫిషర్ పరిస్థితి తారుమారయ్యింది. కింగ్ ఫిషర్ ఫ్లైట్ ఎక్కడం ఒకప్పుడు హైక్లాస్ అనుకున్నవాళ్లు సైతం.. ఇప్పుడు ఆ ప్లేన్ టికెట్ కొనడానికే భయపడుతున్నారు. ప్రయాణీకుల సంగతి అటుంచితే.. విమానాలు నడపడానికి డబ్బులు లేక.. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది కింగ్‌ఫిషర్. దాదాపు 7 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. పీకల్లోతు అప్పులు.. నిర్వహణా లోపాలు కలిసి కింగ్ ఫిషర్ ఉసురు తీశాయి. కింగ్ ఫిషర్‌తో పాటే మిగిలినసంస్థలూ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. మొత్తంమీద చూస్తే.. అన్ని కంపెనీలు కలిపి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లోనే ఉంది. ప్రభుత్వ భారీగా ఆర్థిక సాయాన్ని ప్రకటించినా.. కోలుకునే దశలో లేదు ఎయిర్ ఇండియా. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనంతో మొదలైన సంక్షోభం ఇంకా సమసిపోలేదు.
ఇక అతిపెద్ద విమాన సంస్థ అయిన జెట్ ఎయిర్ వేస్ కూడా ఈ సారి భారీ నష్టాలను చవిచూసింది. భారీ ఇంధన ఛార్జీలు, తక్కువ టికెట్ ధరల కారణంగా నష్టాలు ఎదురవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో 118 కోట్ల లాభాన్ని సాధించిన జెట్ ఎయిర్ వేస్.. ఈ సారి మాత్రం 101 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది.
సన్ గ్రూప్ సంస్థకు చెందిన స్పైస్ జెట్ 1077 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. రెండేళ్ల పాటు లాభాలను అందుకున్న స్పైస్‌జెట్.. ఈ ఏడాది మాత్రం నష్టాలను చవిచూస్తోంది.
ఇక చిన్న సంస్థైన గో ఎయిర్కూ నష్టాలు తప్పలేదు. కొన్ని నగరాలకే సర్వీసులు అందిస్తున్న ఈ సంస్థ... 65.5 కోట్ల రూపాయల లాస్లో ఉంది. ఇలా దేశంలో విమాన సర్వీసులు నిర్వహిస్తున్న అన్ని కంపెనీలు నష్టాల్లో ఉంటే.. ఒక్క ఇండిగో మాత్రమే లాభాలను అందుకొంటోంది. మార్కెట్ షేర్‌ను పెంచుకోవడంలోనూ ఇండిగో దూసుకువెళుతోంది. ఇండిగో తరహాలో మిగిలిన సంస్థలు మారకపోతే.. అన్నీ కుప్పకూలడం ఖాయం. భవిష్యత్ అవసరాలకు ఎంతో కీలకమైన విమానయానంరంగం ఇలా సంక్షోభంలో కూరుకుపోతే.. దేశ అభివృద్ధి కష్టమేనంటున్నారు నిపుణులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి