4, మార్చి 2012, ఆదివారం
జగన్ అరెస్ట్‌పై కలకలం
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం లోగా జగన్ అరెస్ట్ జరుగుతుందంటూ.. రాష్ట్రవ్యాప్తంగా వదంతులు వ్యాపించాయి. చాలా చోట్ల నుంచి జగన్ పార్టీ కార్యకర్తలు రాజధానికి బయలుదేరడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. ఉదయం వరకూ ఎలాంటి అరెస్ట్ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వదంతులకు మరింత బలం చేకూర్చుతూ.. జగన్.. తన నెల్లూరు జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డి తరపున జగన్ ప్రచారం చేయాల్సి ఉంది. కానీ.. తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ తన టూర్‌ను రద్దు చేసుకుని, ఇంట్లోనే ఉండిపోయారు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి