17, ఆగస్టు 2011, బుధవారం
వణికిస్తున్న ఒక్కడు
Categories :
anna hazare . news . TOP
ఒక్కడు....ఒకే ఒక్కడు... వెనక ఆస్తులు లేవు... అధికారమూ లేదు....రాజకీయ పార్టీల మద్దతు లేదు... ఉన్నదల్లా ప్రజల ఆదరణ... వారికోసం ఏదో చేయాలన్న తపన....ఆ తపనే ఆయన్ను నడిపిస్తోంది. యువకుడు కాదు...కానీ వయసుపైబడ్డ నాయకుడు....బక్కపల్చని జీవి... గాంధీయుజమే అతని అస్త్రం....అహింసను ఆయుధంగా మార్చాడు....
ఒకే ఒక్కడు అనుకున్న పాలకులు ఆ ఒక్కడ్ని అరెస్ట్ చేశారు. ఉద్యమాన్ని ఆపగలం అనుకున్నారు. హజారేపై అవినీతి బురద చల్లారు. కానీ ఆ ఒక్కడి వెనుక ఉన్న కోట్లమంది జనాన్ని ఆఖర్లో గుర్తించారు. వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో గడగడా వణికిపోయారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడ్ని ఆపలేమని గుర్తించారు..
ఓ మాములు వ్యక్తి ప్రారంభించిన ఉద్యమం మహాశక్తి తరంగమై తననెక్కడ కబళిస్తుందోనని కేంద్రం భయపడుతోంది. అందుకే దీక్షకు అనుమతివ్వలేకపోతోంది. దీక్షకు ఒప్పుకోవడం అంటే తమ గొయ్యి తామే తవ్వుకోవడమేనని పాలకులకు తెలుసు. అవినీతి లోతుల్లోకి వెళితే
ముందు తమతోనే మొదలు పెట్టాల్సి ఉంటుంది. సగం మంది నేతల్ని జైల్లో పెట్టాల్సి వస్తుంది.
అయినా హజారే అడిగింది అవినీతిని తక్షణం అంతం చేయమని కాదు...పటిష్ఠ లోక్‌పాల్ బిల్లు.... ప్రధాని, న్యాయవ్యవస్థ, పార్లమెంట్లో ఎంపీల ప్రవర్తనను దీని పరిధిలోకి తీసుకురావాలని మాత్రమే కోరుతున్నారు. అయినా ఇందుకు కేంద్రం అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే తేడా వస్తే ఏమవుతుందోనన్న భయం.
(Article by J.Kishore Kumar)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి