6, ఆగస్టు 2011, శనివారం
బన్నీరూట్లోనే చెర్రీ..!
Categories :
బావ బన్నీ రూట్లోనే చెర్రీ కూడా నడుస్తున్నాడు. చాలాకాలంగా ప్రేమిస్తున్న ఉపాసనను పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాడు రాంచరణ్. అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనుమరాలు ఉపాసన. వీరిద్దరూ చెన్నైలో కలిసి చదువుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వినికిడి. రెండు రోజుల క్రితం చిరంజీవి, ఉపాసన కుటుంబాన్ని కలిసి పెళ్లి విషయాన్ని చర్చించారు. నవంబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం నిర్వహించబోతున్నారు. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని రాంచరణ్ అనుకున్నప్పటికీ, చిరంజీవే తొందరపెడుతున్నట్లు తెలిసింది. పెళ్లి కూడా వీలైనంత తొందరలోనే చేయనున్నారు. మొత్తానికి చిరంజీవి కుటుంబంలో ఇది రెండో ప్రేమ వివాహం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి