1, ఆగస్టు 2011, సోమవారం
ఆయన నోరు తెరిస్తే చిచ్చే..!
తెలంగాణపై ఆయన ఏం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ఏం చేసినా రాద్ధాంతమవుతోంది. ఆయనే చిదంబరం, కేంద్ర హోంశాఖామాత్యులు. తెలంగాణకు సంబంధించి మరో వివాదాస్పద ప్రకటన చేశారు చిదంబరం. తెలంగాణవాదులు, ఉద్యోగులు ఎప్పట్నుంచో కోరుతున్న 14(F)ను తొలగించడంపై కీలక కామెంట్లు చేశారు. ఆ తీర్మానాన్ని తొలగించడానికి రాష్ట్రపతికి రికమండ్ చేస్తామంటూనే, అందుకు రాష్ట్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేయాలని ఆయన మెలిక పెట్టారు. 2010 జనవరిలో అసెంబ్లీ తీర్మానం చేసిందని విషయాన్ని గుర్తు చేస్తూనే.. మరోసారి తీర్మానం చేయాలని సీఎంను కోరినట్లు ప్రకటించారు. 14Fపై ఇప్పుడు ఏకాభిప్రాయముందో లేదో తెలుసుకోవడానికే తీర్మానం చేయాలని కోరినట్లు వెల్లడించారు. CCPAనే ఈ తీర్మానం చేయాలని కోరినట్లు చిదంబరం చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 14Fపై మళ్లీ తీర్మానం సాధ్యం కానేకాదు. అంటే.. ఎస్.ఐ రాతపరీక్షలకు సంబంధించిన వివాదం ఇప్పట్లో సద్దుమణగదు. ఫ్రీ జోన్‌గా తొలగించాలన్న తెలంగాణవాదుల డిమాండ్ నెరవేరదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి