14, జులై 2011, గురువారం
ఎన్టీఆర్ డాన్స్ సీక్రెట్
Categories :
తెలుగు హీరోల్లో డ్యాన్స్ అద్భుతంగా చేయగల హీరో జూనియర్ ఎన్టీఆర్ అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎంత కష్టమైన స్టెప్పునైనా అవలీలగా చేస్తూ సినీ ప్రేక్షకులకు కనువిందు చేస్తుంటాడు. అదుర్స్ లోని అస్సలాంవాలేకుం పాటలో ద్విపాత్రాభినయంలో కనిపిస్తూ అదరగొట్టాడు. అయితే, ఈ పాట పిక్చరైజేషన్ కు సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ లో, ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ మధ్య విపరీతంగా తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్‌కు డ్యాన్సే రాదంటూ కామెంట్లూ మొదలయ్యాయి. గ్రీన్ మ్యాట్ లో తీసిన ఈ పాటలో బ్యాలెన్సింగ్ కోసమే సపోర్ట్ తీసుకున్నాడో.. లేక.. డ్యూయల్ రోల్ కాబట్టి హ్యాండ్ సెటప్ కోసం పక్కన మనిషిని పెట్టుకున్నాడో తెలియదు. కానీ, ఈ ఫొటో మాత్రం సంచలనమే. ఈ ఫోటోను చూసిన తర్వాత మీరేమంటారు..? ఎన్టీఆర్ కు డ్యాన్స్ వస్తుందా..? లేక డ్యాన్స్ ను మేనేజ్ చేస్తున్నాడా..? కావాలంటే యూట్యూబ్ లో ఉన్న అదుర్స్ పాటను చూసి తేల్చుకోండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ద్విపాత్రాభినయం కోసం చేసే గ్రీన్ మ్యాట్ విధానంలొ అలానే చేస్తారు అంతవరకే కాని డ్యాన్స్ కోసం అలా పట్టుకొని గ్రీన్‌మ్యాట్ ఉపయోగించరు..! చాలా మందికి మెదుడు మోకాల్లో ఉంటుందిలే..అనవసరపు రాద్దాంతాలు కావాలి కదా..!! అందుకే ఆ ఆర్టిస్ట్ కి డ్యాన్స్ రాదనే అభ్ఇయోగం మోపుతున్నారు.