31, జులై 2011, ఆదివారం
మారాల్సింది మా బట్టలు కాదు.. మీ చూపులు
మహిళలు ధరించే దుస్తులపై కొనసాగుతున్న వివక్ష తొలగాలంటూ ఢిల్లీలో అంతర్జాతీయ స్లట్ వాక్ నిర్వహించారు. మారాల్సింది తమ దుస్తులు కాదని.. పురుషుల ఆలోచనా ధోరణి అంటూ అమ్మాయిలు గళమెత్తారు. అబ్బాయిల్లానే నచ్చిన డ్రస్సులు వేసుకొనే స్వతంత్రం అమ్మాయిలకు ఉందని, వాటిపై ఆంక్షలు విధించడం తగదంటూ ర్యాలీ నిర్వహించారు. మహిళలపై దాడులు తగ్గాలంటే.. వస్త్రధారణ మార్చాలంటూ వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఈ ర్యాలీ జరిగింది. నాలుగు నెలల కిందట టొరంటోలో జరిగిన ర్యాలీకి కొనసాగింపుగా ఢిల్లీలో ఈ ర్యాలీని నిర్వహించారు. దీనికి ఢిల్లీ యూత్ మద్దతు పలికారు. జంతర్ మంతర్ దగ్గర ప్రారంభమైన ఈ ర్యాలీ రాజధాని నగరంలో ప్రధాన రహదారుల గుండా కొనసాగింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇండియాలో ఒళ్ళు సఘం కనిపించే బట్టలు వేసుకునేవాళ్ళు ఎంత మంది ఉన్నారు? పల్లెటూర్లలో ఒంటి నిండా చీర కట్టుకునే స్త్రీలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయే.
కాబట్టీ అత్యాచారాలకి కారణం బట్టలు కాదు మరేదో ఉంది..... :)
సెక్స్ పిచ్చి ఉన్నోడు ఒంటి నిండా బట్టలు వేసుకున్న స్త్రీనైనా రేప్ చేస్తాడు. అటువంటప్పుడు బట్టలపైనే నిబంధన పెడితే ఏమి లాభం?
boys mind set marali appuse e dadulu apagalamu.....
kontha mandi ammaye lu boys ni mosam cheyadam walana... boys e la thayaru avuthunnaru