30, జులై 2011, శనివారం
భలే మంచి చౌక బేరము... అమ్మకానికో పట్టణము...
Categories :
news . TOP . town for sale
ఇప్పటివరకు ఇల్లమ్ముతాం.. ఫ్లాట్ అమ్ముతాం.. ల్యాండ్ అమ్ముతాం అనే వాళ్లనే చూసి ఉంటారు. కానీ ఏకంగా ఇప్పుడో టౌన్ నే అమ్మేవాళ్లొచ్చారు. అవును, ధర కూడా చాలా తక్కువే. జస్ట్ ఓ మూడున్నర కోట్లకు కాస్త ఎక్కువగా ఉంటే చాలు.. జూబ్లీహిల్స్‌లో డ్యూప్లెక్స్ హౌసే మూడునాలుగు కోట్లకు అమ్ముతున్నప్పుడు.. అమెరికాలో ఓ టౌన్ మూడున్నర కోట్ల రూపాయలకే అమ్మేస్తున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదా.. అయితే.. ఆ టౌన్ డీటైల్స్ కూడా చదవండి..
అమ్మకానికి వచ్చిన టౌన్ పేరు సీనిక్. సౌత్ డకోటా స్టేట్ లో ఉంది. దీని యజమాని పేరు ట్విల్లా మెరిల్. అతని క్యాన్సర్ సోకిందన్న విషయం ఈ మధ్యే తేలిందట. దీంతో, అతని కుమార్తె ఈ టౌన్ ను అమ్మకానికి పెట్టింది. టౌన్ బాగోగుల చూడడానికి టైం సరిపోదని, తన తల్లి కోసం టైం కేటాయించాలని.. అందుకే అమ్ముతున్నానని చెబుతోంది. అమెరికన్ డాలర్లలో ఈ టౌన్ విలువ జస్ట్.. 7,99,000 మాత్రమే. మన కరెన్సీలో మూడున్నర కోట్లకు కాస్త ఎక్కువగా తేలుతుంది. ఇంత తక్కువకు టౌన్ ఎలా వస్తుంది..? అసలీ టౌన్ లో ఏమున్నాయి...?
ఈ పట్టణంలో మొత్తం 9 ఇళ్లున్నాయి. రెండు స్టోర్లు, సెలూన్, గ్యాస్ స్టేషన్, పోస్టాఫీస్ ఉన్న చిన్న టౌన్ ఇది. ఈ పట్టణం మొత్తం విస్తీర్ణం 46 ఎకరాలు ఉంటుంది. అంతేకాదు.. ఈ టౌన్లో ప్రత్యేకంగా రెండు జైళ్లు కూడా ఉన్నాయి. చూడడానికి కాస్త ఓల్డ్ గా ఉన్నా, జాగ్రత్తగా డీల్ చేస్తే మాత్రం దీన్నో అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ కింద్ మార్చేయొచ్చు. అమెరికాలో ఉన్న మనవాళ్లకు ఈ విషయం తెలిస్తే.. ఎగిరిగంతేస్తారేమో...! ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులక చెప్పినా, బేరం ఆడి మరీ కొనేయొచ్చు.. కాదంటారా..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి