29, జులై 2011, శుక్రవారం
ఐ హేట్ బాలయ్య ఎవరో తెలుసా..?
Categories :
ఐహేట్ బాలయ్య.కామ్ వెబ్ సైట్ తో హడావిడి చేసిన వ్యక్తి ఎవరో ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టారు. వెబ్ సైట్ లో తనపై అసభ్యంగా రాస్తూ, తన పరువుకు భంగం కలిగిస్తున్నారని కొన్నాళ్లక్రితం సీసీఎస్ పోలీసులకు బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిడ్నీ నుంచి వెబ్ సైట్ పనిచేస్తున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. అత్తిలి రాజేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఈ సైట్ ను నిర్వహిస్తున్నట్లు తాజాగా గుర్తించారు. రాజేంద్రనాథ్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా గూడూరు. ప్రస్తుతం సిడ్నీలోనే ఉంటున్నాడు. ఐ హేట్ చిరు. కామ్ సైట్ కూడా ఇతనే నిర్వహిస్తున్నాడు. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. అత్తిలి ఇండియాకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి