రాగం - చక్రవాకం
తాళం - త్రిపుట
భళి వైరాగ్యంబెంతో బాగై యున్నది
చంచలమైన నామనసు నిశ్చలమై యున్నదే
అరిషడ్వర్గములు నన్నంటకున్నవి
శ్రీ హరి నామ స్మరణ జిహ్వను అనువై యున్నది
గురుధ్యానమున మనసుకుదురై యున్నది
చిత్త మిరువది యారింటి మీద నిరవై యున్నది
పరమ శాంతమెన్నగను బాగై యున్నది
మాకు పరతత్త్వమందే మా బుద్ధి పట్టియున్నది
విరసము పోరులేని విధమై యున్నది
మాకు ప్రకౄతి యెడబాసి మోక్షమున కిరవై యున్నది
గురి భద్రాద్రీశునందే గురువై యున్నది
యిపుడు అరమరలేక రామదాసుడనదగి యున్నది
23, జులై 2011, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి