31, జులై 2011, ఆదివారం
సీఎంతో లగడపాటి రహస్య చర్చలు..!
విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. వైఎస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడులకు సంబంధించి... లగడపాటి సోదరుడు శ్రీధర్‌ను సీబీఐ ప్రశ్నించిన నేపథ్యంలో ఈ భేటి ప్రత్యేకతను సంతరించుకుంది. జగతి పబ్లికేషన్స్‌లో లగడపాటి సోదరుడు శ్రీధర్‌కు చెందిన లార్స్కో పెట్టుబడులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీంతో జగన్‌తో తనకు ఎటువంటి అనుబంధం లేదని లగడపాటి ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకున్నారని తెలిసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి