20, జులై 2011, బుధవారం
నేను సగం ఇండియన్ అయితే.. మరి రాహుల్..?
తన జాతీయత వివాదానికి రాహుల్ గాంధీని ముడిపెట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్. టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన ఇంటర్వ్యూలో ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చిన కత్రీనా, పాస్ పోర్ట్ విషయానికి వచ్చేసరికి మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడింది. తన జాతీయత విషయం అందరికీ తెలుసని, తన తల్లిపేరు పాస్ పోర్టులో ఉంటుందనీ చెప్పింది. తాను సగం భారతీయురాలినని, సగం యురోపియన్ననీ స్పష్టం చేసింది. అంతేకాదు, తాను హాంకాంగ్‌లో పుట్టానన్న విషయం చాలా తక్కువమందికీ తెలుసంది. అంతవరకూ బాగానే ఉన్నా, ఆ తర్వాతే కత్తిలాంటి డైలాగ్ వదిలింది. ఫిఫ్టీ ఫిప్టీగా తానొక్కదాన్నే లేనని, తాను హాఫ్ ఇండియన్-హాఫ్ యురోపియన్ అయినట్లు.. రాహుల్ గాంధీ కూడా హాఫ్ ఇండియన్ - హాఫ్ ఇటాలియన్ అనీ బాంబు పేల్చింది. భారతదేశం విషయానికి వచ్చేసరికి, రాహుల్ గాంధీ ఎంతో, తాను అంతే అన్నట్లు చెప్పేసింది. అంతే మరి, రాహుల్ గాంధీ ఇండియనే అయితే... కత్రీనా కూడా ఇండియనే. కేవలం అందాల ఆరబోత మాత్రమే తనకు తెలుసనుకున్నవారికి, తన బుర్రలో ఎంత టాలెంట్ ఉందో కూడా ఈ దెబ్బతో చెప్పేసింది కత్తిలాంటి కత్రీనా..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి