5, జులై 2011, మంగళవారం
కేసీఆర్ రాజీనామాస్త్రం
మరోసారి కేసీఆర్ రాజీనామాస్త్రం
అర్ధరాత్రి ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా...
లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖ ఫ్యాక్స్
కేంద్రాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమైన కేసీఆర్
ఇంతకూ కేసీఆర్ వ్యూహమేంటి?
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. మరోసారి తన ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అర్ధరాత్రి తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. తెలంగాణ ప్రాంత టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల రాజీనామాలతో పాటూ తానూ రేసులో ఉన్నానని కేసీఆర్ చాటిచెప్పారు.. నేడో రేపో ఆయన స్పీకర్‌ను కలిసి తన రాజీనామాను ఆమోదింప చేసుకోనున్నారు.
2001లో టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు ఎమ్మెల్యే స్థానానికి కూడా రాజీనామా చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు.. 2004లో కరీంనగర్ లోక్‌సభ స్థానంలో గెలిచిన కేసీఆర్... యూపీఏ సర్కార్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నాన్చుడు ధోరణితో విసిగిన కేసీఆర్ మరోసారి కేంద్ర మంత్రి పదవితోపాటు ఎంపీ స్థానానికి కూడా రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలుపొందారు. 2008లో మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రాజీనామా చేసిన కేసీఆర్ కరీంనగర్ ఎంపీ స్థానంలో మరోసారి గెలుపొందారు.. ఆ తర్వాత 2009లో ఆమరణదీక్ష చేపట్టి కేంద్రంతో తెలంగాణ సానుకూల ప్రకటన చేయించారు..
ఇప్పుడు మరోసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు.. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతల రాజీనామాలకు మద్దతుగా కేసీఆర్ ఈ పని చేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యూహమేంటనేది
ఎవరికీ అంతుచిక్కడం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి