1, జులై 2011, శుక్రవారం
అందుకు చిరంజీవే మారుపేరు
Categories :
మాటమార్చడానికి మారుపేరుగా మారిపోయిన మెగాస్టార్.. మరోసారి మాటమార్చారు. 150 వ సినిమా ఇక చేయబోనని యూటీవీ యాక్షన్ తెలుగు ఛానల్ ప్రారంభోత్సవంలో ఘనంగా ప్రకటించిన చిరంజీవి, 48 గంటలు గడవకుండానే మళ్లీ మొదటికొచ్చారు. సినిమాల్లో నటిస్తానని అనౌన్స్ చేసేశారు.
కాస్త నాటకీయంగానే చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పారు. ఐమాక్స్‌లో జరిగిన బుడ్డాహోగా తేరాబాప్ ప్రివ్యూకు చిరంజీవి హాజరయ్యారు. అమితాబ్, పూరీజగన్నాథ్, రామ్‌గోపాల్‌వర్మ, ప్రభాస్, రవితేజ, ఛార్మీ ఈ ప్రివ్యూకు హాజరయ్యారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన అమితాబ్ చిరంజీవి సినిమాల్లో మళ్లీ నటించాలని...150వ సినిమా చేయాలని కోరారు.. ఇంతలో రామ్‌గోపాల్‌వర్మ మైక్ లాక్కున్నారు. మీరు సినిమాల్లో నటించకపోతే ఎలా అన్నారు. అలా ఎవరైనా ఎప్పుడైనా అనకపోతారా అని ఎదురుచూస్తున్న చిరంజీవి.. మొహమాటపడుతున్నట్లే ఫేస్ పెట్టి.. ఓకే అనేశారు. అంతేకాదు.... మరి మీరు గెస్ట్ రోల్ చేస్తేనే అంటూ అమితాబ్ కు ఓ ట్విస్ట్ ఇచ్చారు. గెస్ట్ రోలేగా.. నాకూ ఓకే అన్నారు అమితాబ్. ఇంకేముంది.. చిరంజీవి కోరిక తీరిపోయింది. అంతమంచి అవకాశాన్ని వదులుకోవడం ఎందుకనుకున్నారో.. మైక్ అందేసుకున్న పూరీ.. చిరంజీవి 150వ సినిమాకు నేనే డైరెక్టర్‌నని ప్రకటించేశారు. సినిమాల్లో నటిస్తానని, నటించనంటూ.. గుండ్రంగా తిరుతున్న చిరంజీవి మరో సున్నాను పూర్తి చేశారు. ఈ సారన్నా ఈ మాట మీద నిలబడతారో.. లేదంటే.. కొన్నాళ్లకే మార్చేస్తారో చూడాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి