6, మే 2011, శుక్రవారం
ఎన్టీఆర్ పెళ్లి ఫొటోలు
Categories :
కళ్యాణ వైభోగం అంటే ఇదే. రామాయణంలో సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో గానీ, హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి వివాహం సీతారమ కళ్యాణాన్ని తలపించింది. పెళ్లి వేడుకను చూడడానికి వచ్చినవారంతా ఆశ్చర్యపోయేలా.. అందమైన అనుభూతులను గుండెల్లో పదిలంగా దాచుకునేలా.. మరచిపోవాలన్నా మరిచిపోలేని విధంగా... జూనియర్ పెళ్లి జరిగింది.
ఎన్టీఆర్-ప్రణతిల వివాహ వేడుకను వర్ణించడం ఎవరితరమూ కాదు. ఈ పెళ్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. సంస్కృతీసంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు.. అచ్చమైన తెలుగు పద్ధతులతో సాగింది ఎన్టీఆర్ వివాహమహోత్సవం. పండితుల వేదమంత్రాల నడుమ, తల్లిదండ్రుల తోడుగా పెళ్లిమండపంలోకి వరుడు ఎన్టీఆర్ అడుగుపెట్టడంతో పెళ్లికార్యక్రమం మొదలయ్యింది.
శాస్త్రోక్తంగా వరుడు చేయాల్సిన పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం, ప్రధాన మండపం పక్కనే ఉన్నమరో మండపంలో వధువుతో పూజాకార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అడుగులో అడుగువేసుకుంటూ వధువు ప్రణతి, పెళ్లిమండపంలో పాదం మోపింది. తమ కుమార్తెను అర్థాంగిగా స్వీకరించమంటూ, వరుడు కాళ్లుకడిగి కన్యాదానం చేశారు నార్నే దంపతులు. వేదపండితులు నిర్ణయించిన శుభముహూర్తంలో ప్రణతి తలపై ఎన్టీఆర్ జీలకర్రబెల్లం పెట్టి అర్థాంగిగా చేసుకున్నాడు. తారకరాముడిని వివాహమాడుతున్న సంబరంతో సిగ్గుల మొగ్గగా మారిన ప్రణతి మెడలో మూడుముళ్లూ వేశాడు ఎన్టీఆర్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి