21, ఫిబ్రవరి 2011, సోమవారం
ఖాకీలపై ఉస్మానియా ఉపాయాలు
Categories :
పోలీసుల ఎత్తులకు ఉస్మానియా విద్యార్థులు పైఎత్తులు వేస్తున్నారు. పోలీసులనే వణికిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఖాకీలను ఎదుర్కోవడానికి ఎన్నో ఉపాయాలను అమలు చేశారు. విద్యార్థులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు ఎక్కువగా ఉపయోగించే టియర్‌గ్యాస్‌ను సమర్ధవతంగా ఎదుర్కోగలిగారు. ఆ ఉపాయాలు ఏమిటంటే..
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఉస్మానియా విద్యార్థులను గేట్ దగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. తోపులాటలతో మొదలైన గొడవ రాళ్లు విసురుకునేదాకా సాగింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పినా విద్యార్థులు వెనక్కి తగ్గకకుండా రాళ్ల వర్షాన్ని ఉధృతం చేశారు. అంతే, తమ అసలైన అస్త్రాన్ని బయటకు తీశారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. గతంలో ఇలా బాష్పవాయువు ప్రయోగించినప్పుడు పోలీసులదే ఆధిపత్యం. పొగను తట్టుకోలేక విద్యార్థులు తలోదిక్కూ పారిపోయేవారు. కానీ ఈసారి అలా జరగలేదు. టియర్‌గ్యాస్ షెల్ పడడం ఆలస్యం దాన్ని నిర్వీర్యం చేయగలిగారు స్టూడెంట్స్.
టియర్‌గ్యాస్ షెల్ పడగానే ఓ విద్యార్ధి వచ్చి మట్టిపోసేశాడు. మరో విద్యార్థి వచ్చి పొగరాకుండా దానిపై రాళ్లను వేసేశాడు.. మరో చోట షెల్ పడగానే మరొకరొచ్చి పొదల్లోకి దాన్ని తన్నేస్తాడు. అలా షెల్ పడడం.. ఇలా ఉపాయాలు అమలుకావడం చకచకా జరిగిపోయాయి. వెరసి తెల్లమొఖం వేయడం పోలీసుల వంతయ్యింది.
కొంతమంది ఆ షెల్స్‌ను క్యాచ్ పట్టుకొని, తిరిగి పోలీసుల మీదకే విసిరేశారు. దీంతో, షెల్స్ వల్ల లాభం లేదనుకుని మళ్లీ లాఠీలకే పనిచెప్పారు ఖాకీలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
హ హ్హ హ్హ.... శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలుంటాయిగదా మరి:)
ఖబర్దార్ ఆజాకర్లారా......... ఖబర్దార్.
.........ఆజాకర్..........
ఆంధ్రా రజాకర్లకు అతికినట్లున్న పదమ్.
అప్పటి తెలంగాణ పోరాట వీరులు రజాకర్లను తరమి తరిమి కొట్టిండ్రు. ఇప్పుడు మనొంతు. ఈ అబద్దాలా ఆజాకర్లను చార్మినార్ దగ్గర గెదిమిగెదిమి కొట్టనీకి మనకిదే మంచి మొకా. ఒరేయ్ సిగ్గుశరమ్ లేని అజాకర్లారా, దమ్ముంటే ఒక్కసారి ఉస్మానియాకొచ్చి అనుండ్రా మీరంటున్న శరమ్ లేని మాటలు. అప్పుడు చూపిస్తమ్ తెలంగాణ దెబ్బ ఎట్లుంటదో.
అజాకర్లకు ఆరిపోయే దినమ్ దగ్గరవడ్డది కొడకల్లారా. దినాల్లెక్కవెట్టుకోండ్రి.